రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సకాలంలో వర్షాలు కురవాలని కోరుకుంటూ రైతులు వినూత్న పూజలు నిర్వహించారు. శివాలయంలో శివలింగానికి జలదిగ్బంధం చేసి, వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. అనంతరం వర్షాల కోసం కప్పతల్లి ఆట ఆడారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాలు రైతుల ఆవేదనను, వర్షాల కోసం వారి ఎదురుచూపులను ప్రతిబింబిస్తాయి.