తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బిజీ షెడ్యూల్ నుండి కాస్త విరామం దొరకడంతో ఇంట్లో మనవడి కోసం ప్రేమగా గరిట పట్టారు. వంటగదిలోకి వెళ్లి, మనవడి కోసం స్వయంగా పూరీలు తాల్చి, వేడి వేడి నూనెలో వేయించి, సరదాగా వడ్డించారు. ఈ క్రమంలో మనవడితో ఆయన చిట్ చాట్ చేస్తూ నవ్వుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనవడి చిలిపి ప్రశ్న అందరినీ ఆకట్టుకుంది.