అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదు.. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు.