వైఎస్సార్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్లో జరిగిన వైఎస్సార్ మెమోరియల్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతున్న సమయంలో షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలను వేదిక మీదకు స్వయంగా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తన కుర్చీలో కూర్చోవచ్చని వ్యాఖ్యానించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది