తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. మావోయిస్టులపై జరుగుతున్న ఆపరేషన్ కగార్, కాల్పుల విరమణ వంటి అంశాలపై వారు చర్చించారు. శాంతి చర్చల కమిటీతో గతంలో జరిగిన భేటీ తర్వాత ఈ సమావేశం జరిగింది. జానారెడ్డి సలహాలతో ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్తుందని సీఎం తెలిపారు. దిగ్విజయ్ సింగ్ తో కూడా ఫోన్లో మాట్లాడారు.