తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ, శివుడిని పేదల దేవుడిగా, శ్రీరాముడిని ధనికుల దేవుడిగా అభివర్ణించారు. దక్షిణాది ద్రవిడులు శివుణ్ణి, ఉత్తరాది ఆర్యులు రాముణ్ణి పూజిస్తారని పేర్కొన్నారు. బీజేపీ ధనికుల పార్టీ కాబట్టి రాముణ్ణి ఆరాధిస్తుందని, జై శ్రీరామ్ అంటుందే తప్ప హరహర మహాదేవ అని ఎందుకు అనరని ప్రశ్నించారు.