విజయవాడ శివారులోని కంకిపాడులో జరిగిన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుక బుధవారంనాడు ఘనంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ వధూవరులను ఆశీర్వదించారు. అంతకు ముందు వారిద్దరూ పరస్పరం పలకరించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.