తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందిన ఒక వ్యక్తి ఇంటికి విచ్చేశారు. సన్నబియ్యంతో వండిన భోజనం చేసిన రేవంత్ రెడ్డి.. వారి జీవన పరిస్థితులు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.