రంగా రెడ్డి జిల్లాకు చెందిన గుండు శివకుమార్ అనే అధ్యాపకుడు ఆకులపై అద్భుతమైన బొమ్మలు చెక్కుతున్నాడు. దేశ నాయకులు, తెలంగాణ నేతలు, సినీ హీరోలు, దేవుళ్ళ బొమ్మలు ఆకుల మీద అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు. రాగి ఆకులు, తాటి ఆకులు, మందారం ఆకులను ఉపయోగించి, వెయ్యికి పైగా బొమ్మలు ఇప్పటి వరకు రూపొందించాడట.