బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు మరోసారి నిరాశ ఎదురైంది. 2015లో రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుండి విజయం అందని ద్రాక్షగా ఉంది. నితీశ్తో కలిసి డిప్యూటీ సీఎంగా పనిచేసిన తేజస్వి, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.