హనుమకొండ బస్టాండ్లో టీ స్టాల్ నడుపుతున్న వల్లపు వెంకటేశ్ అదృష్టవంతుడయ్యాడు. చిట్టీల ద్వారా లక్ష రూపాయలు పొంది, వాటిని ములుగు మున్సిపాలిటీలోని ఏకైక బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ కోసం టెండర్ వేశాడు. 376 దరఖాస్తుల నుండి లక్కీ డ్రాలో అతనికి లైసెన్స్ లభించింది. ప్రస్తుతం కోట్లు పెట్టి దాన్ని కొనుగోలు చేయడానికి పలువురు పోటీ పడుతున్నారు.