టేస్ట్ అట్లాస్ తాజా నివేదిక మేరకు.. ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల జాబితాలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో హైదరాబాద్ 50వ స్థానంలో నిలిచింది. బిర్యాని, హలీం, ఇరాని చాయ్ వంటి ప్రసిద్ధ వంటకాలతో పాటు, అంతర్జాతీయ వంటకాల అందుబాటు కూడా ఈ ర్యాంకింగ్‌కు కారణం. అయితే, ఆహార నాణ్యత, పరిశుభ్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆహార ప్రియులు అభిప్రాయపడుతున్నారు.