తమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అన్నా డీఎంకే పార్టీ తన తొలి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ఉండగా, పురుషులకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అదనంగా, గ్రామీణ పేదల కోసం అమ్మ ఇల్లు పథకం కింద ఇళ్ల నిర్మాణం, పట్టణ పేదల కోసం అపార్ట్మెంట్లు, ఉపాధి హామీ పథకంలో పని దినాలను 150కి పెంచడం వంటివి ప్రకటించింది.