తమిళనాడులో పెరుగుతున్న పరువు హత్యలకు వ్యతిరేకంగా, సీపీఎం పార్టీ తమ కార్యాలయాలను ప్రేమ వివాహాలకు వేదికగా మార్చాలని నిర్ణయించింది. కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు పార్టీ కార్యాలయాలు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం ప్రకటించారు. పరువు హత్యలకు వ్యతిరేకంగా కఠిన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.