తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్రిముఖ పోటీగా నెలకొంటోంది. డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పాటు విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా బరిలోకి దిగింది. అభ్యర్థుల తొలి జాబితా విడుదల సందర్భంగా పార్టీ నేతల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. చెన్నై పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేయనున్నారు. ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి.