కూతురి స్కూల్ ఫీజు కోసం కష్టపడి కూడబెట్టిన డబ్బును ఒక తండ్రి పోగొట్టుకోగా, అనారోగ్యంతో ఉన్న బిడ్డ మందుల కోసం మరో తండ్రి దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఇద్దరు తండ్రుల దీన గాథ బంజారాహిల్స్ పోలీసులను కూడా కంటతడి పెట్టించింది. వారి దయనీయ పరిస్థితులు మానవతా కోణాన్ని ఆవిష్కరించాయి.