ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ గర్భిణి సమన్విత మరణించారు. రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఆమెను ఢీకొట్టింది. నెల రోజుల్లో బిడ్డకు జన్మనివ్వాల్సిన ఆమె మృతితో భర్త శోకసంద్రంలో మునిగారు. నిందితుడు 19 ఏళ్ల ఆరోన్గా గుర్తించారు.