మారుతున్న జీవనశైలితో థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. భారతదేశంలో కోట్లాది మంది హైపర్, హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యతను నివారించడానికి, నిపుణులు కొన్ని రకాల ఆహారాలను సూచిస్తున్నారు. ఉసిరి, గుమ్మడి గింజలు, కొబ్బరి, పెసలు వంటి సూపర్ ఫుడ్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి, హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రణలో ఉంచుతాయి.