డాన్సర్స్ యూనియన్ వివాదం మరోసారి రాజుకుంది. ఇప్పటికే ఉన్న కమిటీ పక్కన మరో అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేయడం, దాని సభ్యులపై అవినీతి ఆరోపణలు చేయడంపై యూనియన్ అధ్యక్షురాలు సుమలత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫెడరేషన్‌పై నాన్-కోఆపరేషన్ నోటీస్ ఇవ్వలేదని, యూనియన్ను చీల్చే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, "నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతా" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.