వేసవిలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే చెరకు రసం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, తయారు చేసిన వెంటనే తాగడం మంచిది. ఇది 15-20 నిమిషాల్లో రంగు మారిపోతుంది. వేసవి కాలంలో కేవలం గంటలోపే చెడిపోతుంది. ఎక్కువ సేపు నిల్వ చేయడం వల్ల పుల్లబడటం లేదా విషపూరితం కావడం జరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే తాజాగా తాగాలి.