చెరుకు రసం అనేక పోషకాలతో నిండి ఉంటుంది. అయితే వర్షాకాలంలో దీనిని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఆసిడిటీ, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న చెరుకు రసం అలసటను తగ్గిస్తుంది. పచ్చకామెర్లకు ఉపశమనం కలిగిస్తుంది. మధుమేహం ఉన్నవారు వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం.