స్ట్రాబెర్రీల్లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటాయి. రెగ్యులర్‌గా వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండాకాలంలో హైడ్రేషన్‌ను పెంచుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. అధిక నీటి శాతం ఉండటం వల్ల ఆకలిని నియంత్రించి, క్యాలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. నిపుణులు బరువు తగ్గడానికి స్ట్రాబెర్రీలను ఉత్తమ ఎంపికగా సూచిస్తున్నారు.