శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. కార్తీక మాసంలో 33 రోజుల్లో భక్తులు రూ. 7.27 కోట్లు సమర్పించారు. గత కార్తీకంతో పోలిస్తే ఇది రూ. 1.30 కోట్లు అధికం. 117 గ్రాముల బంగారం, 7 కిలోల వెండి, విదేశీ కరెన్సీ కూడా సమకూరాయి.