శ్రీశైలం జలాశయంలో ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ఆరు గేట్లను పది అడుగుల మేర ఎత్తి.. 2,27,59 క్యూసెక్కుల నీటిని దిగువునకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 881 అడుగులుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది.