శ్రీశైలం డ్యామ్‌కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు మూడు గేట్లు తెరిచి 10 అడుగుల ఎత్తున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 882.80 అడుగులు, నిల్వ 203 టిఎంసిలు. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాలు పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి.