మీకేం తక్కువ? మేము ఎందులో తక్కువ అంటున్నారు హీరోయిన్లు. ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీ పై జ్యోతిక చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. సౌత్ లో అగ్ర హీరోలు అందరితోనూ నటించిన ఈమె సౌత్ లో పోస్టర్ల పై హీరోయిన్ల మొహాలు కనిపించవని, కేవలం హీరోలే ఉంటారని, కనీసం హీరోయిన్ పోస్టర్ ను ప్రమోట్ చేయడానికి హీరోలకు మనసు రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జ్యోతిక.