తిరుపతి జిల్లా కేబీబీ పూర్ మండలం కలతూరు గ్రామంలో సాయం సంధ్యవేళ పొదల్లో రెండు పాములు పెనవేసుకున్నాయి. దాదాపు 15 అడుగుల పొడవున్న రెండు పాముల చుట్టూ పరిసరాలను మరచిపోయి సుమారు గంటన్నర పాటు సయ్యాటలో మునిగితేలాయి. పొదల్లో అలికిడి విని ఏమై ఉంటుందా అని పరిశీలించిన స్థానికులకు ఈ అద్భుత దృశ్యం కనిపించింది.