పాములు తమ పాత చర్మాన్ని (కుబుసం) ఎందుకు విడుస్తాయో తెలుసా? ఇది వారి శరీర పెరుగుదలకు అవసరం. పాత చర్మం కింద కొత్త చర్మం ఏర్పడిన తర్వాత.. పాములు తమ పాత చర్మాన్ని వదిలివేస్తాయి. చిన్న పాములు నెలకు మూడు నుంచి నాలుగు సార్లు.. పెద్ద పాములు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు కుబుసం విడుస్తాయి. పాము విడిచిన కుబుసం ప్రమాదకరం కాదు.