సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరాలో వెచ్చదనం కోసం ఓ పాము కారు ఇంజిన్లో దూరి ఇరుక్కుపోయింది. బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న పామును స్నేక్ క్యాచర్ అతి కష్టం మీద రక్షించారు. స్పృహ తప్పిన పాముకు శ్వాస అందించి, నీళ్లు పోసి మళ్లీ ప్రాణాలను పోశారు.