పెద్దపల్లి జిల్లాలోని ఓ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శివలింగంపై పెద్ద నాగుపాము కనిపించింది. వేకువజామున ఆలయానికి వచ్చిన అర్చకుడు దీన్ని చూసి భయపడినప్పటికీ, భక్తులు పామును నాగేంద్రుడిగా భావించి నమస్కరించారు. సోమవారం రోజున శివయ్యతో పాటు నాగేంద్రుని దర్శనం లభించిందని భక్తులు సంతోషపడ్డారు.