విశాఖ ఆగనంపూడిలోని ఓ ఇంట్లో స్వీట్లు తయారు చేస్తుండగా, భారీ త్రాచుపాము ఇంట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలుకలుగా భావించిన కుటుంబ సభ్యులు, తర్వాత పామును గుర్తించి భయాందోళనకు గురయ్యారు. స్థానిక స్నేక్ క్యాచర్ కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని, చాకచక్యంగా పామును బంధించి, అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.