పాతబస్తీలో మూసీ పరివాహక ప్రాంతంలో కొండ చిలువ కనిపించడంతో స్థానికులు స్నేక్ క్యాచర్కు సమాచారమిచ్చారు. స్నేక్ క్యాచర్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అది అనూహ్యంగా అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే స్నేక్ క్యాచర్ చాకచక్యంగా తప్పించుకుని.. జాగ్రత్తగా దాన్ని బంధించాడు.