విశాఖపట్నం గోపాలపట్నంలోని ఓ ఇంట్లో ఆరడుగుల నాగుపాము కలకలం రేపింది. బాత్రూంలో వింత శబ్దాలు వినిపించడంతో కుటుంబ సభ్యులు గమనించి, నాగరాజును చూసి షాక్కు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించగా, సురక్షితంగా పట్టుకుని తరలించారు. జనావాసాల్లోకి పాములు రావడంపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు.