కోనసీమ జిల్లా రాయవరంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు బాణసంచా తయారుచేస్తున్న కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.