భద్రాచలం క్షేత్రంలో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించగా, మిథిలా స్టేడియంలో అభిజిత్ లగ్నంలో శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.