సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలకు సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని ఓ రిసార్ట్లో సింగర్ మంగ్లీ తన జన్మదినాన్ని గ్రాండ్గా జరుపుకుంది. ఇక్కడ విదేశీ మద్యం, గంజాయి వినియోగించినట్లు పోలీసులు తొలుత ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మంగ్లీ తోసిపుచ్చారు.