బులియన్ మార్కెట్లో వెండి ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి. మంగళవారం ఒక్కరోజే కిలో వెండి ధర 9,000 రూపాయలు పెరిగి రూ.2,06,000కు చేరుకుంది. పారిశ్రామిక డిమాండ్ విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. సోలార్ ప్యానళ్లు, ఎలక్ట్రిక్ కార్లు, మొబైల్ ఫోన్లలో వినియోగం పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి.