ఉదయం నిద్ర లేచిన వెంటనే వెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వ్యర్థాలను బయటికి పంపుతుంది. గ్యాస్, యాసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తపోటును కూడా మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.