ప్రభాస్ తల్లిగా ఫౌజీ సినిమాలో నటిస్తున్నాననే వార్తలపై సీనియర్ నటి జయప్రద తాజాగా స్పష్టతనిచ్చారు. తాను ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించనున్నట్లు ధృవీకరించారు. ప్రభాస్తో కలిసి నటించడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని జయప్రద ఓ వేదికపై తెలియజేశారు. ఈ ప్రకటనతో ఫౌజీ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.