సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలోని ఓ మహిళా ప్రైవేట్ హాస్టల్లో సీక్రెట్ బయటపడి సంచలనం సృష్టించింది. హాస్టల్ నిర్వాహకుడు మహేశ్వర్ ఫోన్ చార్జర్లలో దాచి ఉంచిన కెమెరాను అమ్మాయిలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కెమెరాలోని డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ ఘటనతో హాస్టల్ వాసులు భయాందోళనలో మునిగిపోయారు.