అమరావతిలో జరిగే మోడీ సార్ సభకు, స్క్రాప్ మెటీరియల్తో తయారుచేసిన విగ్రహాలను ప్రదర్శిస్తున్నారు. ఎన్టీఆర్, బుద్ధుడు, మోడీ, చంద్రబాబు వంటి వ్యక్తుల విగ్రహాలతో పాటు, మేక్ ఇన్ ఇండియా చిహ్నాలను కూడా రూపొందించారు. కళాకారుడు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు ఈ విగ్రహాలను తయారుచేశారు. సుమారు 80 విగ్రహాలు ఇప్పటికే తయారుచేయబడ్డాయి. లక్ష కోట్ల రూపాయల అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం సందర్భంగా ఈ విగ్రహాలు ప్రదర్శించబడుతున్నాయి.