మొబైల్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత కూడా చార్జర్ని ప్లగ్ లో వదిలేయడం వల్ల అనేక ప్రమాదాలున్నాయి. అనవసరమైన విద్యుత్ వినియోగం, అగ్ని ప్రమాదాలు, చార్జర్ వేడెక్కడం వంటివి జరుగుతాయి. చార్జర్ ని ఉపయోగించిన తర్వాత తీసివేయడం ద్వారా విద్యుత్తును ఆదా చేయవచ్చు. ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చు.