సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 45 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మక్కా యాత్ర ముగించుకొని మదీనాకు వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో బస్సు పేలిపోయింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.