సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ శివారులో మొసలి పిల్లలు, 60కి పైగా గుడ్లు బయటపడటంతో కలకలం రేగింది. పశువుల కాపరులు గుర్తించి అటవీశాఖకు సమాచారం అందించగా, సిబ్బంది వాటిని మంజీరా వన్యప్రాణి అభయారణ్యానికి సురక్షితంగా తరలించారు. ఇది స్థానికులను భయాందోళనకు గురిచేసింది.