నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ సంగమేశ్వరాలయం ఎనిమిది నెలల తర్వాత కృష్ణా జలాల నుంచి పూర్తిగా బయటపడింది. ఏడు నదులు కలిసే అద్భుత ప్రదేశంలో నెలకొన్న ఈ ఆలయం, ఏటా నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. ఇన్ని నెలలు నీటిలో ఉన్నా శివలింగం, ఆలయ నిర్మాణం చెక్కుచెదరకపోవడం విశేషం. సోమవారం నుంచి ప్రత్యేక పూజలు, దర్శనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.