పుష్పా 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను అల్లు అరవింద్, బన్నీ వాసు పరామర్శించారు. ఐదు నెలల ఆసుపత్రి చికిత్స తర్వాత, ఏప్రిల్ 29న డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ప్రస్తుతం రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. అల్లు ఫ్యామిలీ శ్రీతేజ్ చికిత్స ఖర్చులను భరిస్తున్నట్లు తెలిసింది.