స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ విషయంలో మరో బిగ్ డెసిషన్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిర్మాతగా మారిన ఈ బ్యూటీ, త్వరలో మెగా ఫోన్ పట్టుకోబోతున్నారనే వార్త ఒకటి మూవీ సర్కిళ్లలో జోరుగా చక్కర్లు కొడుతోంది. సొంత బ్యానర్లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను సామ్.. డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది.