సినీ నటి సమంత "న్యూ బిగినింగ్స్" అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడంతో రాజ్ నిడిమూరుతో ఆమెకున్న సంబంధంపై చర్చ జరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 నుంచి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా ఫోటోలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే ఇద్దరూ ఈ విషయంపై స్పందించలేదు.