సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. సామాజిక మాధ్యమాలలో ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ, సమంత అమితంగా నమ్మే ఈషా సెంటర్ వేదికగా 30 మంది సన్నిహితుల సమక్షంలో ఈ ఉదయం 7 గంటలకు మూడు ముళ్ల వేడుక నిర్వహించారు.