బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును నటి సమంత పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూర్లోని ఈశా యోగా సెంటర్లో డిసెంబర్ 1న అత్యంత నిరాడంబరంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. భూత శుద్ధి వివాహం అనే ప్రత్యేక పద్ధతిలో, మహిళా పూజారితో ఈ వేడుక జరిగింది. సమంత స్వయంగా వివాహ ఫోటోలను పంచుకున్నారు.